ప్రియమైన పాఠకులారా, ఆర్. ఎస్. చింతలపాటి దర్శకత్వం వహించిన మా మొదటి మినీ చిత్రం “హంతకులు: ప్రథమ భాగము” 23 జూలై 2023న మా యూట్యూబ్ ఛానెల్ & వెబ్సైట్ నందు విడుదల కానుందని తెలియజేసేందుకు సంతోషిస్తున్నాము. ఈ చిత్రం ఒక సర్వసాధారణమైన వైద్యుడు తన సొంత ప్రయోజనాల కోసం ఉన్మాదులను ఎలా వినియోగించుకుంటాడు అనే దాని గురించి రూపొందించబడింది. ఆ పయనంలో, ఫార్మసీలో అపూర్వమైన జ్ఞానం కలిగిన ఒక జైలర్ తో సంభాషణ ఎటు దారి తీస్తుందో చూడండి! టీమ్ విషయానికొస్తే, ఈ మినీ చిత్రాన్ని మంజూష చింతలపాటి నిర్మించారు. ఆర్. ఎస్. చింతలపాటి దర్శకత్వం వహించగా, మనోహర్ కోవిరి సినిమాటోగ్రఫీ అందించారు. నటీనటుల విషయానికొస్తే, శ్రీకర్ అయ్యగారి డాక్టర్ పాత్రలో & వికాస్ యలమంచిలి ఖైదీగా నటించారు. నిర్మాణానంతర పనుల విషయానికొస్తే, ఈ చిత్రానికి నిఖిల కోట్ని ఎడిట్ చేశారు, మధూలిక ఆచంట డైలాగ్స్ వ్రాసారు, తరుణ్ చింతం సంగీతం అందించగా, రవీంద్ర పాటోజు సాంకేతికంగా సపోర్ట్ అందించారు. మా అభిమానులు కథనాన్ని ఆస్వాదిస్తారని మేము ఆశిస్తున్నాము మరియు వారి అభిప్రాయం కోసం మేము ఆసక్తిగా ఎదురుచూస్తున్నాము. ఇట్లు రైటర్స్ పౌచ్ టీమ్ |
Categories
All
Archives
September 2023
|